Business
6 భారత ఆయిల్ కంపెనీలపై US ఆంక్షలు
ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నాయన్న ఆరోపణలపై భారత్‌కు చెందిన ఆరు ఆయిల్ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అమెరికా విదేశాంగ శాఖ తాజా ప్రకటనలో ఈ ఆంక్షల వివరాలు వెల్లడించాయి. ఇరాన్ ముడి చమురు ఉత్పత్తుల వ్యాపారం కొనసాగిస్తుండటంతో, ఆయా కంపెనీలు US ఆంక్షలకు గురయ్యాయని స్పష్టం చేశారు.
ఇరాన్ చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నదన్న నెపంతో, అమెరికా ఈ చర్యకు తెగబడ్డట్లు తెలిపింది. ఇది ప్రపంచ భద్రతకు ముప్పుగా మారే అవకాశముందని వ్యాఖ్యానించింది. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు, అంతర్జాతీయంగా ఆయిల్ మద్దతుదారులపై ఇలా ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా స్పష్టం చేసింది.
ఇప్పటికే భారత్‌పై 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన నేపథ్యంలో, తాజా ఆంక్షలు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ స్పందన ఎలా ఉంటుందనే అంశంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. Meanwhile, ఆయా ఆయిల్ కంపెనీల పట్ల కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.