Business
ఈ డాలర్ శక్తి వెనుక ఎంతో చరిత్ర ఉంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఒక చక్రవర్తిలా రాజ్యం చేస్తుంది. ఈ డాలర్ శక్తి వెనుక ఎంతో చరిత్ర ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం, 1944లో బ్రెటన్‌వుడ్‌స్ ఒప్పందం ద్వారా డాలర్‌కు ‘ప్రధాన అంతర్జాతీయ కరెన్సీ’ హోదా దక్కింది. అంటే.. దేశాలు ఒకదానికొకటి చేసే లావాదేవీల్లో డాలర్‌నే ఆధారంగా పెట్టుకున్నాయి. అంతేకాకుండా, తాము కలిగి ఉన్న డాలర్ల ద్వారా అమెరికా ఇతర దేశాలపై ఆర్థిక ప్రభావం చూపించగలుగుతోంది. చమురు, బంగారం వంటి విలువైన వస్తువులు కూడా ప్రధానంగా డాలర్లలోనే కొనుగోలు చేయబడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ‘డాలర్’ ఒక్క కరెన్సీ మాత్రమే కాకుండా.. అమెరికా ప్రభావాన్ని ప్రపంచానికి రుజువు చేసే ఓ ఆర్థిక ఆయుధంగా మారింది.
ఇంత శక్తిమంతంగా ఉన్న డాలర్ విలువ ఇటీవలి కాలంలో ఎందుకు తగ్గుతోంది అన్నది ఆసక్తికరమైన అంశం. 2025కి వచ్చేసరికి అమెరికా ఆర్థిక వ్యవస్థ కొన్ని సమస్యలతో బాధపడుతోంది. అధిక రుణాలు, పెరుగుతున్న బడ్జెట్ లోటు, రాజకీయ అస్థిరత, అంతర్జాతీయంగా చైనాతో మద్దతుగా ఏర్పడుతున్న కొత్త కూటములు (ఉదా: బ్రిక్స్ దేశాలు) వంటి అంశాలు డాలర్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే, ఇతర దేశాలు కూడా డాలర్‌పై ఆధారపడకుండా స్వదేశీ కరెన్సీల్లో లావాదేవీలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకి, చైనా-రష్యా మధ్య యువాన్‌లో వ్యాపారం, ఇండియా-ఇరాన్ మధ్య రూపీలో చమురు కొనుగోలు వంటివి.
ఇక అంతర్జాతీయ పెట్టుబడిదారుల విషయంలో కూడా చిన్న చిన్న సంకేతాలు చాల పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే, డాలర్ యాప్ మీద నమ్మకం కొంత మందిలో తగ్గుతుంది. ఈక్రమంలో డాలర్ డిమాండ్ తగ్గడం వలన దాని విలువ పడిపోతుంది.