International
4 కోట్ల మందిని చంపిన చంఘీజ్ ఖాన్‌కు ‘ఎకో సేవర్’ అనే ట్యాగ్?
చంఘీజ్ ఖాన్ పేరు వినగానే చరిత్రలో అత్యంత హింసాత్మక పాలకుడిగా గుర్తుండిపోతాడు. 12వ శతాబ్దంలో మంగోలియా నుంచే తన సామ్రాజ్యాన్ని ప్రారంభించిన ఆయన, ఆసియా, ఐరోపా, మిడిల్ ఈస్ట్ వరకు విస్తరించాడు. యుద్ధాలు, దండయాత్రలు, ఊహించలేని విధంగా జరిగిన మారణహోమాల్లో దాదాపు 4 కోట్ల మందిని హతమార్చిన ఘోర చరిత్ర చంఘీజ్ ఖాన్‌దే. అతడి దాడులు చాలా మానవ సముదాయాలను నేలమట్టం చేసేశాయి. ఆయన్ని చూసి మాత్రమే చాలా రాజ్యాలు వణికిపోయేవి. ఒక మనిషి చేతిలో ఇంత మంది చనిపోయారని చరిత్రలో నమోదు కావడమే గాక, అతని వల్ల కొన్ని నాగరికతలు అంతరించిపోయాయని కూడా చరిత్రకారుల అభిప్రాయం.
అయితే ఇప్పుడే కొంతమంది శాస్త్రవేత్తలు ఇచ్చిన విశ్లేషణ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చంఘీజ్ ఖాన్ హింసాత్మక దండయాత్రల వల్ల తక్కువగా జనాభా మిగలడం, పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు పునఃప్రకృతంగా మారడం జరిగిందని వారు తెలిపారు. ఇందువల్ల గాలి కాలుష్యం, కార్బన్ ఉద్గారాలు తగ్గాయని, భూమి పునరుత్పత్తి శక్తి కొంతవరకూ పెరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చంఘీజ్ ఖాన్‌ను ‘ఎకో సేవర్’గా అభివర్ణించడాన్ని కొన్ని వర్గాలు ప్రారంభించాయి. కానీ, ఇదొక తీవ్రమైన ఐరనీగా, మానవ విలువలకు తేడా చూపే అర్ధవంతమైన చర్చగా విమర్శకులు పేర్కొంటున్నారు.