Latest Updates
38 రోజులకు తర్వాత తిరిగి గాల్లోకి – తిరువనంతపురంలో F-35 యుద్ధ విమానం టేకాఫ్
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నుంచి బ్రిటీష్ రాయల్ నేవీకి చెందిన F-35 యుద్ధ విమానం 38 రోజుల విరామం తర్వాత గాల్లోకి ఎగిరింది. జూన్ 14న ఒక ఎమర్జెన్సీ పరిస్థితిలో ల్యాండ్ అయిన ఈ ఫైటర్ జెట్, ఆ తర్వాత విమానాశ్రయంలోనే నిలిపివేయబడింది.
విమానంలో హైడ్రాలిక్ సిస్టమ్‌కు సంబంధించి కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. దీంతో బ్రిటన్‌కి చెందిన ఇంజినీర్ల బృందం ప్రత్యేకంగా భారత్‌కి వచ్చి మరమ్మతులు చేపట్టింది. అన్ని పనులు పూర్తయ్యాక నిన్న పరీక్షాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహించగా, ఇవాళ (జులై 22) ఉదయం ఆ విమానం విజయవంతంగా టేకాఫ్ అయి యునైటెడ్ కింగ్డమ్ (UK)కి వెళ్లిపోయింది.
విమాన ప్రదేశం నుంచి టేకాఫ్ అయిన దృశ్యాలను ఎయిర్‌పోర్టు సిబ్బంది వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.