Business
25 ఏళ్లలో వెండి ధరలు 16 రెట్లు పెంపు – కేజీకి రూ.7,900 నుంచి రూ.1,24,000 వరకు
గత 25 ఏళ్లలో వెండి ధరలు భారత మార్కెట్‌లో భారీగా పెరిగిపోయాయి. 2000వ సంవత్సరంలో కేవలం రూ.7,900కు లభించిన కేజీ వెండి, ఇప్పుడు దాదాపు 16 రెట్లు పెరిగి రూ.1,24,000కు చేరుకుంది. సామాన్య వినియోగదారుల నుంచి ఆభరణ వ్యాపారుల వరకు ఈ పెరుగుదల ప్రభావం కనిపిస్తోంది. వెండి భవిష్యత్ పెట్టుబడులుగా భావిస్తున్నవారు ఈ గణాంకాలను గమనిస్తున్నారు.
సంవత్సరాల వారీగా ధరల పెరుగుదల ఇలా ఉంది:
2001లో రూ.7,215
2005లో రూ.10,675
2010లో రూ.27,255
2015లో రూ.37,825
2018లో రూ.41,400
2019లో రూ.40,600
2020లో రూ.63,435
2021లో రూ.62,572
2022లో రూ.55,100
2023లో రూ.78,600
2024లో రూ.75,500
ఇప్పటి స్థాయికి చేరిన వెండి రేట్లు మళ్ళీ ఇలాగే పెరగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక రకంగా ద్రవ్యోల్బణానికి, అంతర్జాతీయ మార్కెట్ మార్పులకు అద్దం పడుతోంది.