Devotional

10 వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు: మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు

తెలంగాణలోని మహిళలకు గుడ్‌న్యూస్.... బతుకమ్మ వేడుకల షెడ్యూల్  విడుదల...గిన్నిస్ బుక్ రికార్డ్స్ లక్ష్యంగా వేడుకలు | Times Now Telugu

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ఘనంగా బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు, సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రధాన ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేకంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు. ప్రతి జిల్లాలో మహిళలు సంప్రదాయబద్ధంగా పాల్గొని ఈ పండుగను మరింత వైభవంగా జరుపుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వివరించారు.

అదేవిధంగా, హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద సెప్టెంబర్ 27న బతుకమ్మ కార్నివాల్‌ను సాయంత్రం వేళ ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే ఈ కార్నివాల్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే కళాకారులు, సాంప్రదాయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇక సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో 10 వేల మంది మహిళల సమక్షంలో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. అదే విధంగా 29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపుగా నిలిచిన బతుకమ్మ పండుగను ఈసారి మరింత ప్రత్యేకంగా, ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version