Andhra Pradesh
₹5,500 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు: మంత్రి..
AP: రాష్ట్రంలో గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపడా విద్యుత్ అందించడానికి ₹5,500 కోట్లతో వివిధ పనులు చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవి కౌన్సిల్‌లో తెలిపారు. వీటితో నెట్‌వర్క్ ఓవర్‌లోడ్ తగ్గి లో ఓల్టేజి సమస్య ఉండదన్నారు. కొత్తగా అనేక పరిశ్రమలు వస్తున్నందున డిమాండ్‌కు వీలుగా 63 ప్రాంతాల్లో 33KV సబ్ స్టేషన్లు నెలకొల్పుతున్నామని చెప్పారు. స్కాడా సెంటర్ ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు.
Continue Reading