Latest Updates
హైదరాబాద్: రాంగ్ రూట్ ప్రయాణం చేస్తే హెచ్చరిక – పోలీసుల ప్రత్యేక తనిఖీలు
హైదరాబాద్ నగర వాసులు గమనించండి! ట్రాఫిక్‌కు దూరంగా, త్వరగా గమ్యానికి చేరుకోవాలనే ఆలోచనతో రాంగ్ రూట్లో వెళ్తున్నారా? అయితే వెంటనే ఆపండి. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 వద్ద ట్రాఫిక్ అదనపు డీసీపీ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – రూల్స్ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. రాంగ్ రూట్లో ప్రయాణించడం వల్ల ఒక్కరిగా కాదు, నిబంధనలు పాటిస్తూ వెళ్లే ఇతర వాహనదారులకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని హెచ్చరించారు.
పౌరులంతా ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి, రహదారి నియమాలను పాటించాలని పోలీసులు కోరుతున్నారు.