Latest Updates

హైదరాబాద్‌: ‘బడికి బాట’ కలను నెరవేర్చిన అధికారుల జోష్‌ – థ్యాంక్యూ సర్

After Six Guarantees, Revanth Reddy's 'Seventh Guarantee' too now under  question-Telangana Today

హైదరాబాద్‌ చిలకలగూడలోని దూద్బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్‌ మే 26న “మా బడికి బాట వేయించండి” అంటూ ప్లకార్డు చేతబట్టి వినూత్నంగా ధర్నా చేశారు. విద్యార్థుల రాకపోకలకు బాట లేకపోవడంతో ఆయన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పందించి, తక్షణమే చర్యలు చేపట్టారు.

GHMC సహకారంతో పాఠశాల వద్ద ఉన్న ప్రహరీని తొలగించి, రోడ్డు వేయించారు. అలాగే, పాఠశాలకు గేటు కూడా ఏర్పాటు చేశారు. ఈ అభివృద్ధితో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారిని కలిసి “థ్యాంక్యూ సర్!” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిణామం సామాజిక మాధ్యమాల్లో ప్రజల ప్రశంసలు అందుకుంటోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version