International
హైదరాబాద్ టు గోవా.. ఇక 8 గంటల్లోనే! గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కీలక పురోగతి
గోవా బీచ్‌లలో ఎంజాయ్ చేయాలనుకునే హైదరాబాద్ పర్యాటకులకు కేంద్రం శుభవార్త వినిపించింది. భారత్ మాల పరియోజనలో భాగంగా నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్-10 పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం రోడ్డు మార్గంలో గోవా చేరుకోవడానికి పట్టే 15-18 గంటల సమయం, ఈ కొత్త హైవేతో కేవలం 8 గంటలకు తగ్గనుంది.
కొత్త హైవేగా పనాజీ – బెలగావి – రాయచూరు – హైదరాబాద్,ప్రస్తుతం ఉన్న మార్గం కంటే ఈ కొత్త హైవే వల్ల సుమారు 150 కిలోమీటర్ల దూరం తగ్గనుంది,పెట్టుబడి: సుమారు రూ. 12,000 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా దీనిని తీర్చిదిద్దుతున్నారు,బెలగావి-రాయచూరు సెక్షన్‌లో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రస్తుతం సివిల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే కేవలం పర్యాటకానికే కాకుండా తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాల మధ్య వాణిజ్య సంబంధాలను కూడా బలోపేతం చేయనుంది. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడంతో పాటు, జోగులాంబ గద్వాల మీదుగా సాగే సూరత్-చెన్నై కారిడార్‌తో ఈ రహదారికి అనుసంధానం కలగడం వల్ల ప్రాంతీయ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.హ్యామ్ (HAM) విధానంలో నిర్మిస్తున్న ఈ రహదారి పూర్తయితే, హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లడం ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మారబోతోంది.
![]()
