Latest Updates
హైదరాబాద్: కవిత నిరాహార దీక్షకు భారీ ఏర్పాట్లు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టనున్న నిరాహార దీక్షకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఏర్పాట్లు పూర్తియ్యాయి. 72 గంటల పాటు కొనసాగనున్న ఈ దీక్షకు ధర్నా చౌక్ ప్రాంగణంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. జాగృతి కార్యకర్తలు, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగుతూ అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ నిరాహార దీక్ష ద్వారా స్థానిక సంస్థల నియామకాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కవిత డిమాండ్ చేయనున్నారు. విద్య మరియు ఉద్యోగ రంగాల్లో బీసీలకు న్యాయం జరిగేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆమె ఈ కార్యక్రమం చేపడుతున్నారు. బీసీ సామాజిక వర్గాల హక్కుల సాధనకు ఇది ఓ కీలకమైన పోరాటంగా గుర్తించారు.
దీక్ష సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, జాగృతి కార్యకర్తలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలియజేస్తున్నాయి. కొందరు ప్రముఖులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు దీక్ష ప్రాంగణానికి వచ్చి మద్దతు ప్రకటించనున్నారు. శాంతియుతంగా జరిగే ఈ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు కూడా అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.