Latest Updates
హైదరాబాద్ ఆషాఢ బోనాల సందడి.. ముగింపు ఘట్టం
నెల రోజులుగా ఉత్సాహంగా సాగిన ఆషాఢ బోనాల జాతర ఇవాళ ముగియనుంది. పాతబస్తీలో లాల్దర్వాజ అమ్మవారికి మారుబోనాల అర్పణతో ఈ వేడుకలు పరిపూర్ణం కానున్నాయి. ఈ సందర్భంగా పురవీధుల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపు ఘనంగా జరగనుంది.
ఇక జంట నగరాల్లో ఫలహారం బండ్లు, ఘటాలు, బోనల తొట్టెల ఊరేగింపులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన ట్రస్సులు, LED లైట్లు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రితో బోనాల శోభాయాత్రలు ముగియనున్నాయి.