Latest Updates
హైదరాబాద్‌లో భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య
హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లాపూర్ రాజీవ్ గాంధీ నగర్లో నివాసముంటున్న షాదుల్–తబ్సుమ్ దంపతుల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భార్య తబ్సుమ్ నాలుగేళ్ల క్రితం తాఫిక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన షాదుల్ పలుమార్లు మందలించినప్పటికీ తబ్సుమ్ తన ప్రవర్తన మార్చుకోలేదని స్థానికులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీ రాత్రి షాదుల్ నిద్రిస్తున్న సమయంలో తబ్సుమ్, తన ప్రియుడు తాఫిక్‌తో కలిసి పథకం ప్రకారం దాడి చేశారు. మొదట కొట్టి, ఆపై దిండుతో ముక్కు, నోరు మూసి ఊపిరాడనివ్వకుండా చేసి షాదుల్‌ను హతమార్చారు. ఘటన తరువాత స్థానికులకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మహిళ ఫిర్యాదు, స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చివరికి ఆధారాలు సేకరించి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.