హైదరాబాద్‌లో భారీ నకిలీ ఐఫోన్ల స్కామ్ బహిర్గతం – రూ.3 కోట్ల విలువైన యాపిల్ ఉత్పత్తుల సీజ్
హైదరాబాద్ నగరంలో నకిలీ యాపిల్ ఉత్పత్తుల మాఫియా గుట్టు రట్టు అయింది. టాస్క్ ఫోర్స్ పోలీసుల స్మార్ట్ ఆపరేషన్‌లో మిర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిపిన దాడుల్లో సుమారు రూ.3 కోట్ల విలువైన నకిలీ యాపిల్ యాక్సెసరీస్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్, ఛార్జర్లు, కేబుల్స్, యాప్‌లు అన్నీ నకిలీగా తయారుచేసి అసలైనవి అన్నట్టు ప్రజలను మోసగిస్తున్న ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
ఈ ఘటనలో షాహిద్ అలీ, ఇర్ఫాన్ అలీ, సంతోష్ రాజ్పురోహిత్‌లను అరెస్ట్ చేసినట్టు సమాచారం. వీరు ముంబైలోని ఏజెంట్ల నుంచి డూప్లికేట్ గ్యాడ్జెట్లు కొనుగోలు చేసి, వాటిని హైదరాబాద్‌లో బహిరంగంగా విక్రయించేందుకు సిద్ధమయ్యారని విచారణలో వెల్లడైంది. అసలైన యాపిల్ ఉత్పత్తులను తలపించేలా లోగోలు, స్టికర్లు, సీళ్లతో నకిలీ ప్యాకేజింగ్ రూపొందించి, వినియోగదారులను మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, ఈ నకిలీ గ్యాడ్జెట్లు మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముతూ, యథార్థమైన బ్రాండ్ ఉత్పత్తులపై నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నకిలీ ఉత్పత్తులు సరఫరా చేస్తున్న ముంబైలోని ఇతర నెట్‌వర్క్‌లపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ గ్యాడ్జెట్ల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.