Latest Updates
హైదరాబాద్‌లో దారుణం – గృహిణి హత్య
హైదరాబాద్ కూకట్పల్లిలో రేణు అగర్వాల్ (50) అనే గృహిణి దారుణ హత్యకు గురైంది. డబ్బు, బంగారం కోసం ఇంట్లో పనిచేసే హర్ష్, అతని స్నేహితుడు రోషన్ కలిసి ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న రేణు భర్త, కుమారుడు దుకాణానికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది.
రేణును మొదటగా ఇద్దరు నిందితులు చేతులు, కాళ్లు కట్టి కత్తితో గొంతు కోసి చంపేశారు. అంతటితో ఆగకుండా ప్రెషర్ కుక్కర్‌తో ఆమె తలపై బలంగా బాది ప్రాణాలు తీశారు. హత్య అనంతరం నిందితులు ఇంట్లోనే స్నానం చేసి, దుస్తులు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
తరువాత ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం తీసుకొని, యజమాని స్కూటీపై పరారయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ ఘటనతో కూకట్పల్లిలో కలకలం రేగింది.