Latest Updates
హైదరాబాద్‌లో డేటింగ్ పేరిట మోసాలు: సింగిల్స్ జాగ్రత్త!
హైదరాబాద్‌లో సింగిల్స్‌ను టార్గెట్ చేస్తూ డేటింగ్ పేరిట మోసాలు పెరిగిపోతున్నాయి. డేటింగ్ యాప్‌లు, కాల్స్ ద్వారా వలపు వల వేస్తూ యువతను మోసం చేసే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మాయమాటలు నమ్మి ఎంతోమంది ఆర్థిక, మానసిక వేధింపులకు గురవుతున్నారని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొదట స్నేహం, ప్రేమ పేరిట నమ్మకం కలిగించి, ఆ తర్వాత బ్లాక్మెయిల్, డబ్బులు డిమాండ్ చేస్తూ వేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యువకులు ఇలాంటి కాల్స్, మెసేజ్‌లకు స్పందించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రతి నెలా హైదరాబాద్ పోలీసులకు ఇలాంటి మోసాలకు సంబంధించి కనీసం 12కు పైగా ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. ఈ కేసుల్లో బాధితులు ఎక్కువగా యువతే ఉంటున్నారని, వారు సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌ల ద్వారా మోసపోతున్నారని పోలీసులు వెల్లడించారు. ఒకవేళ వేధింపులకు గురైతే, వెంటనే 9490616555 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. అనవసరమైన కాల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండి, వ్యక్తిగత సమాచారం పంచుకోకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు కోరుతున్నారు.