Latest Updates
హైదరాబాద్‌లో క్యాబ్‌ల ‘డబ్బు’ల్ దందా!
హైదరాబాద్ నగరంలో క్యాబ్ సర్వీసులు, బైక్ ట్యాక్సీలు ప్రజల్ని నిలువుదోపిడీ చేస్తున్నాయని వాపోతున్నారు. ముందు సెకన్లలో బుక్ అయ్యేవి ఇప్పుడు మినిమమ్ 10-15 నిమిషాల వెయిటింగ్ చూపిస్తున్నాయి. బోనాల సీజన్, వరుసగా పడుతున్న వర్షాల నేపథ్యంలో డ్రైవర్లు అదును చేసుకుని రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు వినిపిస్తోంది.
ఒకవేళ బుకింగ్ అయిందంటే, డ్రైవర్‌కు ఇంట్రెస్ట్ లేకపోతే “అధనం”గా చెల్లిస్తే తప్ప రానని యాప్ సూచనలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంకా ఏం అంటే – డ్రైవర్లు బుకింగ్‌ను పరోక్షంగా రద్దు చేయించుకునేలా ప్రవర్తిస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ గందరగోళంలో ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.