Business
హైదరాబాద్‌కి బీచ్ రాబోతోంది!
హైదరాబాద్లో ఒక కొత్త వినోద కేంద్రం రూపుదిద్దుకోబోతోంది. నగర శివారులోని కొత్వాలూడలో ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. మొత్తం రూ.225 కోట్ల వ్యయంతో బీచ్ ప్రాజెక్ట్‌ను డిసెంబర్ నెలలో ప్రారంభించనున్నారు.
ఈ ఆర్టిఫిషియల్ బీచ్‌లో పర్యాటకులను ఆకట్టుకునే అనేక ప్రత్యేక ఆకర్షణలు ఉండనున్నాయి. ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టులు వంటి ఆధునిక సదుపాయాలను ఈ ప్రాజెక్ట్‌లో కలపనున్నారు. వినోదం, విశ్రాంతి, ఆహారం అన్నీ ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి.
ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్య (PPP) పద్ధతిలో ఈ బీచ్‌ను అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే, నగరవాసులు సముద్ర తీరానికి వెళ్లకుండా బీచ్ వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం కలుగుతుంది. పర్యాటక రంగానికీ, స్థానిక ఆర్థిక వ్యవస్థకీ ఇది కొత్త ఊపిరి నింపనుందని అధికారులు భావిస్తున్నారు.