Connect with us

Entertainment

హరిహర వీరమల్లు చూస్తే 10 మార్కులు వచ్చినట్లే! – అభిమాని ఆసక్తికర వ్యాఖ్యలు

Hari Hara Veera Mallu First Review: హరిహర వీరమల్లు మూవీ ఫస్ట్ రివ్యూ, పవన్  కళ్యాణ్ సినిమాకి... | Times Now Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రపై, కథాంశం, ప్రదర్శనలపై ప్రేక్షకుల్లో విశేష స్పందన వ్యక్తమవుతోంది.

ఇటీవల ఈ సినిమాను వీక్షించిన ఓ అభిమాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా పాపులర్ అవుతున్నాయి. “కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు తప్పక ఈ సినిమా చూడాలి. ఇందులో తెలుగు చరిత్ర విశేషంగా చూపించారు. ఈ సినిమా చూస్తే 10 మార్కులు వచ్చినట్లే” అని అతను తెలిపాడు.

ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో భారీగా షేర్ చేస్తూ, సినిమాకు మద్ధతు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రాన్ని ఒక శక్తివంతమైన చారిత్రక విజ్ఞానాన్ని అందించే సినిమా‌గా చెబుతున్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *