Entertainment

హనీమూన్ మర్డర్” కేసు ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. నిర్మాతగా ఆమిర్ ఖాన్?

Aamir Khan to make a movie on Raja Raghuvanshi Mehalaya honeymoon murder  case?

దేశవ్యాప్తంగా కలకలం రేపిన మేఘాలయాలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసును ఆధారంగా చేసుకుని త్వరలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన సేకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇక ఈ కేసు విషయానికి వస్తే — ఇండోర్‌కు చెందిన సోనమ్, తన ప్రేమికుడితో కలిసి భర్త రాజాను హనీమూన్ సందర్భంగా హత్య చేసి, అనంతరం అరెస్టై జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నిజ సంఘటన ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version