Business
స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభం – ట్రేడ్ డీల్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్ నోటుతో ప్రారంభమయ్యాయి. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ చర్చలు మార్కెట్లను ఊగిసలాటలోకి నెట్టిాయి. ప్రారంభ ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 16 పాయింట్లు లాభపడి 83,458 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ మాత్రం ఒక పాయింట్ నష్టంతో 25,459 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
ఇందులో కోటక్ మహీంద్రా బ్యాంక్, NTPC, ఇండస్ ఇండ్ బ్యాంక్, ICICI బ్యాంక్, మరియు ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు టైటాన్, డా. రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, సన్ ఫార్మా వంటి ప్రధాన షేర్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అమెరికా ట్రేడ్ డీల్ పట్ల పెట్టుబడిదారులు మిశ్రమ భావనలో ఉండటంతో మార్కెట్ దిశా నిర్దేశం కోసం వేచి చూస్తోంది