Latest Updates
స్కూల్ బస్సుల ఫిట్నెస్పై ఇబ్రహీంపట్నం RTO సీరియస్
వచ్చే నెలలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో, స్కూల్ బస్సుల ఫిట్నెస్పై ఇబ్రహీంపట్నం ఆర్టీఓ సుభాష్ చంద్రారెడ్డి దృష్టి సారించారు. ప్రతి సంవత్సరం మే 15 నాటికి స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల గడువు ముగుస్తుందని ఆయన తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆర్టీఓ పరిధిలో మొత్తం 2,341 స్కూల్ బస్సులు ఉండగా, ఇప్పటివరకు 696 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.
మిగిలిన 1,645 బస్సులకు ఇంకా ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాల్సి ఉందని, ఈ విషయంలో పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుభాష్ చంద్రారెడ్డి హెచ్చరించారు. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అన్ని స్కూల్ బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేయాలని ఆర్టీఓ ఆదేశించింది.