Latest Updates
సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి: హైకోర్టు ఆదేశం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘానికి (SEC) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే, 30 రోజుల్లోపు వార్డుల విభజన పూర్తి చేయాలని కూడా సూచించింది.
ఇకపోతే, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం 30 రోజుల గడువు, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) 60 రోజుల గడువు కోరిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఈ దోపిడీ మధ్య సమతుల్యం పాటిస్తూ స్పష్టమైన సమయరేఖను నిర్ధేశించింది. దీంతో సర్పంచి ఎన్నికలు సెప్టెంబర్లోపు జరిగే అవకాశం ఖరారయ్యిందని భావిస్తున్నారు.