News
సూరత్‌లో శివ యాదవ్ ఉగ్రరూపం: ముగ్గురిని కిడ్నాప్ చేసి, ఇద్దరిని బలితీశారు!
గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా లిక్కర్ మాఫియా డాన్‌గా పేరున్న శివ యాదవ్ అలియాస్ శివ టక్లా తన గ్యాంగ్‌తో కలిసి మూడు మందిని అపహరించి, వారిలో ఇద్దరిని క్రూరంగా హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ దారుణంపై పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ నెల 1న రాత్రి షోయబ్ ఫిరోజ్ షేక్, నజీమ్ అలియాస్ భంజా సాదిక్, ఇర్షాద్ అలియాస్ కాలియా ఖాదర్ సయ్యద్‌లను శివ టక్లా గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అనంతరం షోయబ్ తల్లికి ఫోన్ చేసి పెద్ద మొత్తం డబ్బు డిమాండ్ చేశారు. షోయాబ్ తన తల్లికి అదే ఫోన్‌లో మాట్లాడి 20,000 రూపాయలు ఇవ్వమని చెప్పడంతో, ఆమె ఆ మొత్తాన్ని చెల్లించింది. కానీ కొడుకు ఇంటికి చేరకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
మొదట్లో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు, గోదాదర ప్రాంతంలో షోయబ్ మృతదేహం లభ్యంతో దర్యాప్తు వేగం పెంచారు. అనంతరం మహారాష్ట్ర పోలీసుల ద్వారా అక్కడ గుర్తుతెలియని మృతదేహం దొరికిందని, అది నజీమ్‌దేనని నిర్ధారించారు. కిడ్నాప్ నుంచి తప్పించుకున్న ఇర్షాద్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఉన్నాడు.
నేరంలో పాల్గొన్న ఆసిఫ్ మోతీ షేక్, జాలం అలియాస్ జగదీష్ ననురామ్ కలాల్‌లను పోలీసులు అరెస్ట్ చేయగా, విచారణలో వారు అన్ని విషయాలు బయటపెట్టారు. షోయబ్‌ను సూరత్‌లోనే చంపి, నజీమ్ మరియు ఇర్షాద్‌లను మహారాష్ట్రకు తరలించారని, అక్కడ నజీమ్‌ను హత్య చేసి నందుర్‌బార్‌లోని తడోడా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో శవాన్ని పడేశామని ఒప్పుకున్నారు.
శివ టక్లాపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని, ప్రస్తుతం బెయిల్‌పై బయటకొచ్చిన తరువాత మళ్లీ నేర ప్రపంచంలో చురుకైనట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు వెతుకులాట కొనసాగిస్తున్నాయి.
#SuratCrime #LiquorMafia #ShivaTakla #GujaratNews #CrimeReport #PoliceInvestigation #KidnapCase #MurderCase #BreakingNews #LawAndOrder
![]()
