Entertainment

సుప్రీంకోర్టులో లైంగిక వేధింపులకు గురయ్యా: బాలీవుడ్ నటి నిమ్రిత్ కౌర్ సంచలన వెల్లడి

Justice BR Gavai: న్యాయవ్యవస్థ తన పరిధి దాటుతోందన్న బీజేపీ నేతలు..  తొలిసారిగా స్పందించిన సుప్రీం కోర్టు | Next Chief Justice BR Gavai Reacts  To objections On Judiciary pcs spl

బాలీవుడ్ నటి నిమ్రిత్ కౌర్ తాను 19 ఏళ్ల వయసులో సుప్రీంకోర్టులో లైంగిక వేధింపులకు గురైన దారుణ అనుభవాన్ని వెల్లడించారు. లా చదువుతున్న సమయంలో సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. ‘కోర్టురూమ్ లాయర్లతో నిండిపోయి ఉంది. జడ్జి వాదనలు వింటున్నారు. ఇంతలో ఎవరో నా వెనుక చేయి వేశారు. తిరిగి చూస్తే అతడు ఓ సీనియర్ లాయర్. పక్కకు జరిగినా మళ్లీ అదే విధంగా చేశాడు’ అని ఆమె ఆ ఘటనను వివరించారు.

తొలుత ఆందోళనకు లోనైనప్పటికీ, వెంటనే తేరుకుని ధైర్యంగా స్పందించినట్లు నిమ్రిత్ తెలిపారు. ‘అతడి చెంపపై గట్టిగా ఒక్కటి ఇచ్చి, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయా’ అని ఆమె చెప్పారు. ఈ సంఘటన తనలో ఎంతో ఆగ్రహం, భయం కలిగించినప్పటికీ, తనను తాను రక్షించుకునేందుకు చేసిన చర్య తనకు ధైర్యాన్నిచ్చిందని ఆమె అన్నారు. సుప్రీంకోర్టు వంటి అత్యున్నత సంస్థలోనూ ఇలాంటి వేధింపులు జరగడం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను మరోసారి రుజువు చేస్తోందని ఈ వెల్లడి సందర్భంగా చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version