Andhra Pradesh

సీనియర్ హీరోల బిజీ లైనప్..!

Senior Hero's : సీనియర్ హీరోలకు కష్టమే.. యువ హీరోయిన్స్ తోనే సినిమాలు.. |  Senior heros finding for heroines-10TV Telugu

టాలీవుడ్‌ సీనియర్ హీరోలు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు వశిష్ఠతో కలిసి పౌరాణిక నేపథ్యంలోని భారీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ పై పనిచేస్తున్నారు. దీని తర్వాత హ్యూమరస్ మాస్ ఎంటర్‌టైనర్‌కి పేరుగాంచిన అనిల్ రావిపూడితో మరో సినిమా చేయనున్నారు. అంతే కాకుండా, గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో హిట్ కొట్టిన బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక నందమూరి బాలకృష్ణ వరుస ప్రాజెక్టులతో స్పీడు పెంచారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘అఖండ-2’ షూటింగ్‌తో బిజీగా ఉన్న బాలయ్య, ఆ ప్రాజెక్ట్‌ తర్వాత గోపీచంద్ మలినేని, క్రిష్ జాగర్లమూడి లాంటి దర్శకులతో కొత్త సినిమాలు చేయనున్నారు. వైవిధ్యభరిత కథలతో మాస్‌కు దగ్గరయ్యే ప్రయత్నంలో బాలకృష్ణ ఉన్నారు.

వెంకటేశ్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లను ఫైనల్ చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న వెంకీ, చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాలో గెస్ట్ రోల్‌ చేస్తున్నట్టు సమాచారం. అలాగే, ‘దృశ్యం’ సిరీస్‌లో మూడో భాగంగా ‘దృశ్యం 3’ కూడా ప్లాన్‌లో ఉంది. అక్కినేని నాగార్జున కీ రాబోయే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆయన నటించిన మాస్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’ ఈ ఆగస్టు 14న విడుదల కానుంది. అంతేకాకుండా, తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా చేయనున్నట్టు ఫిలింనగర్‌లో చర్చ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version