వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ అద్భుత విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ ఆరోన్, సో వూయ్పై 21-12, 21-19 తేడాతో గెలిచి కాంస్య పతకం ఖాయం చేసుకున్నారు.
అయితే మహిళల సింగిల్స్‌లో పీ.వి. సింధు నిరాశపరిచారు. ఇండోనేషియా ఆటగాళి వర్ధనీ చేతిలో 21-14, 13-21, 21-16 తేడాతో ఓటమి చవిచూశారు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్-తనీశా జోడీ టోర్నీ నుండి నిష్క్రమించారు.