Latest Updates
సింగరేణి కార్మికులకు రూ.1,95,610 చొప్పున బోనస్..
TG: సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34శాతం పంచాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా 41 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు రూ.1,95,610 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించారు. 30 వేల మంది ఒప్పంద కార్మికులకు రూ.5,500 చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.
Continue Reading