Connect with us

Andhra Pradesh

సాగునీటి రంగంపై చంద్రబాబు గర్జన: ‘పోలవరం అనుసంధానానికి తెలంగాణ అడ్డు చెప్పవద్దు!’

#చంద్రబాబునాయుడు #పోలవరంప్రాజెక్టు #ఏపీఅసెంబ్లీ #సాగునీటిప్రాజెక్టులు #నదులఅనుసంధానం #గోదావరిపుష్కరాలు #వెలిగొండప్రాజెక్టు #ఏపీరాజకీయాలు #జలవనరులు #ఉత్తరాంధ్ర #తెలంగాణ #ఆంధ్రప్రదేశ్అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు, నదుల అనుసంధానం మరియు గత ప్రభుత్వాల వైఫల్యాలపై సూటిగా స్పందించారు, గంగా-కావేరి నదుల అనుసంధానం తన జీవితకాల స్వప్నమని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించి చరిత్ర సృష్టించామని గుర్తు చేశారు.

పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు వల్ల రెండు రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని, దీనికి తెలంగాణ అభ్యంతరం చెప్పకూడదని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కట్టినప్పుడు ఏపీ అభ్యంతరం చెప్పలేదని, అదే స్ఫూర్తిని ఇప్పుడు చాటాలని కోరారు,గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రారంభోత్సవం చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలందరూ ప్రాజెక్టును సందర్శించాలని సూచించారు, జూలై నెలలో వెలిగొండ ఫేజ్-1 నుంచి నీళ్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పనులను వారానికి ఒకసారి సమీక్షిస్తూ 14 వారాల్లో పూర్తి చేయాలని గడువు విధించినట్లు తెలిపారు.తన హయాంలోనే ఉత్తరాంధ్రలోని 11 సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టులు కుంటుపడ్డాయని, టీడీపీ హయాంలోనే సాగునీటి రంగానికి జలకళ వచ్చిందని ఆయన విమర్శించారు. సర్ అర్ధర్ కాటన్ దొర వారసత్వాన్ని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని వివరించారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *