Andhra Pradesh

సర్జరీ తర్వాత బ్రేక్.. ఇంకా ఆరు నెలల్లో మళ్లీ యాక్షన్‌లోకి: కొడాలి

మాజీ మంత్రి కొడాలి నాని రీఎంట్రీ సంకేతాలు… 18 నెలల తర్వాత వైసీపీ వేదికపై ప్రత్యక్షం

గత సంవత్సరం ఎన్నికల తర్వాత  కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని, దాదాపు 18 నెలల తర్వాత మళ్లీ ప్రజల ముందుకు వచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం భాగంగా గుడివాడలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తన రా

బైపాస్ సర్జరీ అనంతరం వైద్యులు సూచించిన ప్రకారం చాలా నెలలపాటు విశ్రాంతి తీసుకున్నానని, అందువల్ల రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననీ నాని మాట్లాడుతూ కొడాలి వెల్లడించారు. ఇక మరో ఆరు నెలలు చిన్నపాటి కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొని తర్వాత పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమాల్లో యాక్టివ్‌గా ఉంటానని కొడ

ఓటమి తర్వాత దూరంగా…ఇప్పుడు తిరిగి ప్రజల మధ్యకు

గత ఎన్నికల్లో గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొడాలి నాని, టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయ కార్యకలాపాల నుంచి దూరంగా ఉండటంతో అనేక రకాల కథనాలు వెలువడాయి. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని ఇప్పుడు స్పష్టమైపోయింది.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్ర విమర్శలు

ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కొడాలి నాని తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ జగన్ నాయకత్వంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఉన్న లక్ష్యం పేద విద్యార్థులకు వైద్య విద్య అందజేయడమేనని చెప్పారు. ఐదు కాలేజీలు వైసీపీ పాలనలోనే పూర్తయ్యాయని, మరికొన్నింటి పనుల

ఇలాంటి సమయంలో పేదల కోసం నిర్మించిన కాలేజీలను ప్రైవేటీకరించడం అన్యాయం, ప్రజావ్యతిరేకం అని మండిపడ్డారు.

కోటి సంతకాల ఉద్యమానికి భారీ స్పందన

ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నదని కొడాలి నాని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ఈ వినతిపత్రాలను గవర్నర్‌కు సమర్పిస్తామని, ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని తెలిపారు. అలాగే, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొద్దికాలం నిష్క్రియలో ఉన్న కొడాలి నాని మళ్లీ రాజకీయ రంగంలో అడుగు పెట్టడం వైసీపీ నేతలు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

#KodaliNani #YSRCP #APPolitics #Gudivada #MedicalColleges #Privatization #YSJagan #Chandrababu #PawanKalyan #APNews #PoliticalUpdates #AndhraPradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version