Entertainment
సమంత శరవేగంగా చెరిపేసిన చైతూ గుర్తులు: ‘YMC’ టాటూ కనుమరుగు
హీరోయిన్ సమంత తన మాజీ భర్త, నటుడు నాగ చైతన్యకు సంబంధించిన గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నారు. 2021లో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత, ఇప్పటివరకూ ఆయనతో సంబంధం గుర్తుచేసే కొన్ని టాటూలను ఉంచుకున్నారు. ముఖ్యంగా, ఆమె వీపు భాగంలో ‘YMC’ (యే మాయ చేశావే) అనే టాటూ ఉండేది, ఇది వారి ప్రేమకు చిహ్నంగా భావించబడేది.
అయితే, తాజాగా ఓ యాడ్ షూట్ వీడియోలో సమంత వీపు భాగంలో ఈ ‘YMC’ టాటూ కనిపించకపోవడం గమనార్హం. దీంతో ఆమె ఈ టాటూను పూర్తిగా తొలగించినట్లు చర్చలు జోరందుకున్నాయి. నాగ చైతన్యతో తన గతాన్ని పూర్తిగా చెరిపేసే దిశగా సమంత అడుగులు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంపై సమంత నుంచి ఇంతవరకూ ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఈ టాటూ తొలగింపు వెనుక ఉన్న కారణాలపై ఆమె స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అభిమానులు, సోషల్ మీడియాలో ఈ అంశం గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.