Latest Updates
సంజూ శాంసన్ పోస్ట్‌తో CSK ఫ్యాన్స్‌లో ఉత్సాహం
స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ఇటీవల చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తన భార్యతో ఉన్న ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “TIME TO MOVE” అని సంజూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌తో ఆయన రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరబోతున్నారనే అంచనాలతో అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగుతూ పోస్టులు పెడుతున్నారు.
అయితే, సంజూ శాంసన్‌ను సీఎస్‌కే జట్టు దక్కించుకోవాలంటే, రాబోయే ఐపీఎల్ మినీ వేలంలో ఆయనను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజూను వదులుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.