National

సంకల్పానికి నిదర్శనం ‘శ్రేయస్’

Kohli, Iyer और Shami ने नहीं. बल्कि इस Khiladi ने भारत को दिलाया Final में  जगह| Rohit| Virat| Iyer

శ్రేయస్ అయ్యర్… ఈ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఓ సంచలనం. 2024లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించినప్పుడు అందరూ అతని కెరీర్‌పై ఆందోళన చెందారు. కానీ శ్రేయస్ మాత్రం నిరాశకు లొంగలేదు. గాయపడ్డ సింహంలా రెచ్చిపోయి, తన సంకల్ప బలంతో అద్భుత రీతిలో తిరిగి వచ్చాడు. కెప్టెన్‌గా రంజీ ట్రోఫీ, SMAT, IPL, ఇరానీ ట్రోఫీలను గెలిచి తన సత్తా చాటాడు. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి, అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ విజయాలతో బీసీసీఐ కాంట్రాక్ట్‌ను తిరిగి సొంతం చేసుకున్నాడు.

ఇక ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుకు కెప్టెన్‌గా శ్రేయస్ చేసిన కృషి అసాధారణం. ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ కూడా గెలవని ఈ జట్టును అతను ఈ సీజన్‌లో టైటిల్‌కు చాలా దగ్గరగా తీసుకొచ్చాడు. అతని నాయకత్వంలో జట్టు కొత్త ఉత్సాహంతో ఆడింది. శ్రేయస్ ఆటతీరు, నాయకత్వ లక్షణాలు యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాయి. ఒడిదొడుకులు ఎదురైనా, వాటిని సవాళ్లుగా స్వీకరించి విజయం సాధించిన శ్రేయస్, నిజంగా సంకల్పానికి ఓ గొప్ప నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version