Telangana
వైద్య విద్యకు అండగా.. తన ఇంటినే తాకట్టు పెట్టిన హరీష్!

పూర్వ మంత్రి హరీష్ రావు మళ్లీ తమ మానవత్వాన్ని సిద్ధిపేటలో నిరూపించారు. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని వైద్యపీజీ చదువు ఆగిపోకుండా ఓ పేద విద్యార్థిని ఆదుకోవడానికి ఆయన చేసిన సహాయం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మమత అనే యువతికి పీజీ మెడిసిన్‌లో సీటు వచ్చినప్పటికీ, ప్రతి ఏడాది సుమారు ₹7.5 లక్షలు—మొత్తం మూడు సంవత్సరాలకు దాదాపు ₹22.5 లక్షల ఫీజును చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. గడువు దగ్గరపడుతుండగా విద్యా రుణం కోసం బ్యాంకు తలుపులు తట్టినా, తాకట్టు ఆస్తి లేకపోవడంతో రుణం నిరాకరించబడింది.
దీనికి కారణమైన నిలవ వస్తూ, హరీష్ రావు క్షణం ఆలస్యం చేయకుండా స్వయంగా ముందుకు వచ్చారు. సిద్దిపేటలోని తన స్వగృహాన్నే తాకట్టు పెట్టి బ్యాంకు ద్వారా ₹20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు అయ్యేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, హాస్టల్ ఫీజు కోసం అదనంగా ₹1 లక్షను కూడా స్వయంగా అందజేశారు.
మమత కుటుంబం గతంలో కూడా తమ పిల్లల ఎంబీబీఎస్ విద్య కోసం హరీష్ రావు చేసిన సహాయాన్ని గుర్తుచేసుకున్నారు. ఏ బంధం లేకపోయినా నాలుగు మందిలో మూడు మందికి వైద్య విద్య నెరవేర్చేలా చేసిన ఆయన త్యాగం పై వారి కుటుంబం కన్నీటి కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటన “పదవి, అధికారాలు మనుషుల మంచితనాన్ని నిర్వచించలేవు; మనసే గొప్పది”
కరుణ, సహానుభూతి మరియు సేవా భావంతో సహా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ప్రజల్లో విశేషంగా ప్రశంసలు పొందింది.
#HarishRao #Siddepet #EducationSupport #MedicalEducation #StudentAid #HumanityFirst #InspiringLeader #ScholarshipSupport #TelanganaNews #RealHero