Andhra Pradesh

వైజాగ్లో డేటాబేస్ సెంటర్ ఏర్పాటు అంశం పరిశీలించండి: నారా లోకేశ్

Nara Lokesh pitches Vizag to Google Cloud CEO for setting up data centre -  The Hindu

విశాఖపట్నంలో డేటాబేస్ సెంటర్ ఏర్పాటుకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ విషయాన్ని గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రెన్స్కు సూచించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం తన సింగపూర్ పర్యటనలో భాగంగా డ్రూ బ్రెన్స్‌తో భేటీ అయిన లోకేశ్, రాష్ట్రంలో డేటా సెంటర్లకు అనుకూలమైన వాతావరణం ఉందని వివరించారు.

డేటా బేస్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన అంతర్గత వనరులు, అవసరమైన మౌలిక సదుపాయాలు విశాఖలో అందుబాటులో ఉన్నాయని లోకేశ్ పేర్కొన్నారు. ప్రత్యేకించి ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ వంటి అంశాలు డేటా సెంటర్ ఏర్పాటుకు దోహదపడతాయని చెప్పారు. ఈ వనరులను గమనించి గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నారు.

“ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ సర్వర్ సప్లై ఛైన్‌తో అనుసంధానించేందుకు విశాఖ శ్రేష్టమైన కేంద్రంగా నిలుస్తుంది” అని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి టెక్నాలజీ రంగంలో మరిన్ని అవకాశాలు తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version