Latest Updates

వెన్నుపోటు పొడిస్తే ‘నో ఎంట్రీ’: పార్టీ వీడిన నేతలకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాస్ వార్నింగ్!

ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, కష్టకాలంలో వైదొలిగిన వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారు తిరిగి వస్తానంటే సహించేది లేదని, అలాంటి వారు గేటు దగ్గరికి వస్తే చెప్పుతో కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వ్యక్తిత్వమే ముఖ్యం, శత్రువునైనా పార్టీలోకి రానిస్తానేమో కానీ, స్వార్థం కోసం పార్టీని వీడిన క్యారెక్టర్ లేని వారిని మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

బంధుత్వం లేదా స్నేహం పేరుతో వచ్చినా ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. గత 20 ఏళ్లుగా తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని, జగనన్న ప్రభుత్వం మళ్లీ రాగానే వారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం టీడీపీ కార్యకర్తలకే లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని కేతిరెడ్డి మండిపడ్డారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని విష ప్రచారం చేశారని, దీని వెనుక హెరిటేజ్ డైరీ నెయ్యిని అమ్ముకోవాలనే కుట్ర ఉందని ఆరోపించారు. సీబీఐ మరియు సిట్ దర్యాప్తులో కూడా కల్తీ జరగలేదని తేలిందని ఆయన గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version