Health
వీటిని తింటే లివర్‌కి ముప్పు!
మన శరీరంలో డైజషన్ సజావుగా జరిగేందుకు, జీవక్రియ (మెటాబాలిజం) సరిగా సాగేందుకు, అలాగే టాక్సిన్స్ బయటకు వెళ్లే ప్రక్రియకు లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే తినే ఆహారంలో కొన్ని పదార్థాలు లివర్ పనితీరును దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదాన్ని పెంచే మూడు రకాల ఫుడ్స్ గురించి వైద్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.
మొదటిది హై ప్రాసెస్‌డ్ ఫుడ్స్. వీటిలో అధికంగా ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్, కెమికల్ కలర్స్ ఉండటంతో లివర్‌పై అధిక ఒత్తిడి పడుతుంది. రెండవది అధికంగా చక్కెర ఉన్న ఫుడ్స్, ముఖ్యంగా సాఫ్ట్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్ లాంటివి. ఇవి లివర్‌లో కొవ్వు పేరుకుపోయే అవకాశం కల్పించి ఫ్యాటి లివర్ సమస్యకు దారితీస్తాయి. మూడవది అల్కహాల్. అధిక మోతాదులో మద్యం సేవించడం లివర్‌కు నేరుగా నష్టం కలిగించి సిరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది.
డాక్టర్లు చెబుతున్నదేమిటంటే– వీటి వినియోగాన్ని తగ్గించకపోతే లివర్ సమస్యలు మొదలై క్రమంగా హెల్త్‌పై ప్రభావం చూపుతాయని. కాబట్టి రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, తగినంత నీరు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే లివర్‌ను సంరక్షించడం మొదటి అడుగు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.