News
విష ప్రచారం చేసే వారిని పట్టించుకోను: సీఎం
రాష్ట్రంలో మంచి పనులు ఎన్ని చేసినా, కొందరు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తులను తాను ఏమాత్రం పట్టించుకోనని స్పష్టం చేశారు. మాచారంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజల కోసం తాను 24 గంటలూ కష్టపడుతున్నానని, కొందరు నాయకులు ప్రతికూలంగా మాట్లాడినా ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని అన్నారు.
ప్రతి గ్రామంలో ఒకరిద్దరు తాగుబోతులు లేదా సన్నాసులు ఉంటారని, అయితే వారి వల్ల గ్రామానికి ఎలాంటి హానీ జరగదని సీఎం అన్నారు. అలాగే, రాష్ట్రంలో కొందరు నాయకులు ప్రతికూల ప్రచారం చేసినప్పటికీ, ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఉద్ఘాటించారు. ప్రజలకు మేలు చేసే పథకాలపై దృష్టి పెట్టి, విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.