Andhra Pradesh
విశాఖలో వినాయక మండపం వద్ద అన్నదాన మహోత్సవం
విశాఖలోని కొబ్బరితోట వినాయక మండపం వద్ద భక్తులకు నిజంగా కళ్లుచెదిరే అన్నదానం నిర్వహించారు. గణేశ నవరాత్రి వేడుకల సందర్బంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఒక్కో భక్తునికి వడ్డించిన వంటకాల సంఖ్యే 45కి చేరింది. సంప్రదాయ పులిహోర, వెజ్ బిరియానీ నుంచి ఆధునిక రుచులు కలిగిన లస్సీ, బాదం మిల్క్, కుల్ఫీ, స్వీట్ బాక్స్ వరకు అన్నింటినీ భక్తులకు అందించారు.
భోజనానికి తోడు ప్రతి ఒక్కరికి 2 లీటర్ల కూల్‌డ్రింక్ బాటిల్, జున్ను, గోలి సోడా వంటివి కూడా పంచడం విశేషంగా మారింది. ఇంతటి వైభవంగా అన్నదానం చేసిన సందర్భంలో పాల్గొన్న వారంతా ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. భక్తులకు ఆత్మీయతతో వడ్డించిన ఈ ప్రత్యేక విందు నగరంలో చర్చనీయాంశమైంది.
మరింత ప్రత్యేకత ఏమిటంటే, వచ్చిన ప్రతి ఒక్కరికి వెండి వినాయక విగ్రహాన్ని కానుకగా అందించారు. అంతేకాకుండా, మండపంలో ఏర్పాటు చేసిన గణపయ్య విగ్రహం పవన్ కళ్యాణ్‌ను ఎత్తుకున్నట్లున్న శిల్పకళాత్మక రూపకల్పనతో ఆకట్టుకుంది. సంప్రదాయం, సేవ, సృజనాత్మకతను సమన్వయం చేసిన ఈ వేడుక భక్తులకు మరిచిపోలేని అనుభూతిని కలిగించింది.