Latest Updates
వివాహేతర సంబంధాల్లో కాంచీపురం అగ్రస్థానంలో
దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాల పెరుగుదలపై తాజా డేటా ఆందోళన కలిగిస్తోంది. ప్రముఖ డేటింగ్ యాప్ ‘ఆష్లే మాడిసన్’ ఇటీవల జూన్-2025కు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, ఎక్స్ట్రా-మారిటల్ రిలేషన్షిప్స్ కోసం తమ యాప్ను ఎక్కువగా ఉపయోగించే నగరాల్లో తమిళనాడులోని కాంచీపురం మొదటి స్థానంలో నిలిచింది.
ఇదే యాప్ టాప్-10 నగరాల జాబితాలో సెంట్రల్ ఢిల్లీ, గురుగ్రామ్, గౌతమ్ బుద్ధ నగర్, సౌత్ వెస్ట్ ఢిల్లీ, డెహ్రాడూన్, ఈస్ట్ ఢిల్లీ, పుణే, బెంగళూరు, సౌత్ ఢిల్లీ నగరాలు చోటు చేసుకున్నాయి. ఈ జాబితాలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ 18వ స్థానంలో ఉంది. ఈ ట్రెండ్ కుటుంబ విలువలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.