Andhra Pradesh
విజయనగరంలో ఉగ్రవాద కుట్ర కేసు కలకలం రేపుతోంది.
విజయనగరంలో ఉగ్రవాద కుట్ర కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో నిందితులైన సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్‌లకు విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజ్ వద్ద నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ కేసులో సిరాజ్ ఆన్‌లైన్‌లో అమోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ వంటి పేలుడు పదార్థాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదింపులు జరిపిన నిందితులు, సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు స్వీకరించినట్లు తెలుస్తోంది. రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పరీక్షలు కూడా నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు విచారణ కోసం ఎన్‌ఐఏ అధికారులు విజయనగరం చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.