Uncategorized
వింగ్ కమాండర్ అభినందన్‌ను పట్టుకున్న పాక్ మేజర్ ఎన్కౌంటర్లో హతం
2019లో బాలాకోట ఎయిర్ స్ట్రైక్స్ అనంతరం భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పట్టుకున్న పాకిస్తాన్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (37) తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రసంస్థతో జరిగిన తీవ్రమైన గన్‌ఫైర్ ఘటనలో అతడు హతమయ్యాడని పాక్ మీడియా వెల్లడించింది.
బాలాకోట ఎయిర్ స్ట్రైక్స్ సమయంలో పాకిస్తాన్ వాతావరణంలోకి వెళ్లిన అభినందన్ యుద్ధ విమానం కూలిపోవడంతో ఆయన పట్టుబడ్డారు. అప్పట్లో మోయిజ్ షానే అభినందన్‌ను అరెస్ట్ చేసిన ప్రధాన ఆఫీసర్‌గా గుర్తించబడ్డాడు. దేశానికి తిరిగొచ్చిన అభినందన్‌కి భారతదేశం జాతీయ హీరోగా గౌరవం కల్పించింది. తాజాగా మోయిజ్ అబ్బాస్ మృతి వార్త పాక్, భారత మిడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.