Latest Updates
వాహనాలు నీళ్లలో మునిగితే తీసుకోవలసిన జాగ్రత్తలు
వర్షాకాలంలో నీటి మట్టం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాహనాలను తీసుకెళ్లడం చాలా ప్రమాదకరం. బైక్ అయినా, కారు అయినా లోతైన నీటిలో వాహనాన్ని నడపరాదని నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా ఆ నీటిలోకి వెళ్లాల్సి వస్తే, వాహనం ఇంజిన్ ఆగకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఇంజిన్ ఆగిపోతే వెంటనే స్టార్ట్ చేయకూడదు. అలా చేస్తే ఇంజిన్ మరింత నష్టపోతుంది.
కార్ల విషయానికి వస్తే, షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే బ్యాటరీ కనెక్షన్‌ను తీసేయడం ఉత్తమం. ఇక మరమ్మత్తుల విషయంలో, ముందుగా మీ వాహనానికి ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి. వారి ఆమోదం లేకుండా మరమ్మత్తులు చేయిస్తే క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లెయిమ్ రావడం సాధ్యపడదని తెలిసినప్పుడే రిపేర్‌కు వెళ్ళడం ఉత్తమం.