Entertainment
వార్-2’: ‘సలామ్ అనాలి’ సాంగ్ ఫుల్ వీడియో విడుదల
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్-2’ నుంచి ‘సలామ్ అనాలి’ సాంగ్ ఫుల్ వీడియోను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ పాటలో ఇద్దరు స్టార్ హీరోల ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.320 కోట్లకు పైగా (గ్రాస్) వసూళ్లు సాధించినట్లు సమాచారం.