Entertainment
‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ అంచనాలు నెలకొల్పుకున్న ‘వార్ 2’ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. విజయవాడలో ఈ ఈవెంట్ జరగనుందని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ అయితే ఇప్పటికే ఈ కార్యక్రమంపై ఎగ్జైట్ అవుతూ సన్నాహాలు మొదలుపెట్టేశారు.
ఈ ప్రచారంపై తాజాగా ‘వార్ 2’ మూవీ టీమ్ స్పందించింది. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వేదికను ఖరారు చేయలేదని స్పష్టం చేసింది. ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై టీమ్ చర్చలు జరుపుతోందని, ఓసారి ఫైనల్ అయిన తర్వాతే అధికారిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులకు ఫుల్స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు.
ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, యాష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి. దేశ విదేశాల్లోని లొకేషన్లలో షూటింగ్ జరిపిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ నెలకొన్న నేపథ్యంలో, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.