Latest Updates
వారేవా! చిన్నోడు గణపయ్యతో సందడి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కేవలం 5 ఏళ్ల చిన్నోడు తన భక్తిని వినూత్నంగా ప్రదర్శించాడు. తాను ఆడుకునే చిన్న బుల్డోజర్ మోడల్‌పై చిన్న గణపయ్య విగ్రహాన్ని కట్టి ట్యాంక్‌బండ్ మీదకు తీసుకువచ్చాడు. ఈ క్యూట్ సీన్ చూసినవారందరూ ఆశ్చర్యపోయి హర్షం వ్యక్తం చేశారు.
“గణపయ్యను తాళ్లతోనే కాకుండా నీ భక్తితో కట్టేశావ్ బాబు… నీకు సకల శుభాలు కలుగుగాక” అంటూ పలువురు ఆశీర్వదించారు. ఆ చిన్నోడితో చాలామంది ఫొటోలు దిగారు. ఇక అతడి భక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.