International
వారియర్ వోక్స్… ఒక్కసారి నమస్కారం చెప్పాల్సిందే!
ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ మరోసారి తన వీరతను నిరూపించారు. క్రికెట్ అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించారు. జట్టు విజయమే తన లక్ష్యంగా గాయాన్ని కూడా లెక్కచేయకుండా అసాధారణంగా పోరాడారు.
ఒక చేతికి గాయం ఉన్నా, రెండో చేత్తో బ్యాట్ పట్టుకుని వేదికపైకి అడుగుపెట్టిన వోక్స్… ప్లేయర్‌లా కాదు, నిజమైన వారియర్‌లా గ్రౌండ్‌లోకి వచ్చారు. గాయం బాధిస్తున్నా పరుగులు తీస్తూ సహచర ఆటగాడు అట్కిన్సన్‌కు మద్దతుగా నిలిచారు. అతని త్యాగం, పట్టుదల చూసి ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు.
మ్యాచ్‌ను ఇంగ్లండ్ ఓడిపోయినా, వోక్స్ చూపిన పోరాట పటిమ మాత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. “జట్టు కోసం శరీరాన్నే పణంగా పెట్టిన వీరుడు… వోక్స్‌కు టేక్ ఏ బో!” అని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.