Andhra Pradesh
వాయిదా వేసిన వైసీపీ యూరియా ఆందోళనలు
ఈ నెల 6న జరగాల్సిన యూరియా ఆందోళనలను వైసీపీ వాయిదా వేసింది. ఆందోళనలు ఇప్పుడు ఈ నెల 9న నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది.
రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టి, అనంతరం ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది.
అంతేకాకుండా, ఎరువుల సరఫరాను అడ్డుకోవడంలో టీడీపీ నేతలు పాత్ర వహిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
Continue Reading