Andhra Pradesh
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం: APSDMA హెచ్చరిక
వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది.
ఈ అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఎక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA విజ్ఞప్తి చేసింది.
Continue Reading