Latest Updates
వర్షానికి హైదరాబాద్ ఫుల్ జామ్ – ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ స్తంభన
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షం నగర ట్రాఫిక్‌పై భారీ ప్రభావం చూపింది. ప్రధాన మార్గాల్లో వర్షపు నీరు నిలిచిపోవడం, రోడ్లు జలమయం కావడం వల్ల పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లకు దారి తీసింది.
బేగంపేట, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్‌పేట్, మెహదీపట్నం, NMDC చౌరస్తా, మలక్‌పేట, చాదర్ ఘాట్, షేక్‌పేట్ ఫ్లైఓవర్, తిరుమలగిరి, గండిమైసమ్మ–బాచుపల్లి రోడ్డు, సికింద్రాబాద్–తార్నాక, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
వర్షానికి ట్రాఫిక్ నిలిచిపోయిన ప్రాంతాల్లో పోలీసులు క్లియర్ చేయడంలో తహతహలాడుతున్నారు. ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించేందుకు పలు చౌరస్తాల్లో అదనపు బలగాలను మోహరించారు.
వాహనదారులు ప్రతిసారీ వర్షం వస్తే ఇదే పరిస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రోడ్లపై నీటి నిల్వను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుత వాతావరణం దృష్ట్యా ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.